English   

ఇస్మార్ట్ శంక‌ర్.. నిజంగా అంత మ్యాట‌ర్ ఉందంటారా భ‌య్యా..?

shankar
2019-07-21 21:57:16

సినిమాలో నిజంగా అంత మ్యాట‌ర్ ఉందా లేదా అనేది ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గర శంక‌ర్ చేస్తున్న ర‌చ్చ మాత్రం మామూలుగా లేదు. ఈ సినిమా కోసం అభిమానులు ఎగ‌బ‌డుతున్న తీరు చూసి నిజంగానే ఇందులో ఏదో ఉంద‌ని ఫీల్ అవుతున్నారంతా. అస‌లు ఇస్మార్ట్ శంక‌ర్ అంత గొప్ప సినిమా అయితే కాదు.. మామూలు మాస్ సినిమా. కానీ ఇప్పుడు మ‌రో సినిమా ఏదీ లేక‌పోవ‌డం.. చాలా రోజుల త‌ర్వాత మాస్ సినిమా రావ‌డంతో పండ‌గ చేసుకుంటున్నారు అభిమానులు. కానీ పూరీ ఇలాంటి సినిమాలే గ‌తంలో చాలా చేసాడు. కాక‌పోతే ఈ సారి తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవ‌డం కాస్త కొత్త‌గా అనిపించింది అంతే. ఇదిలా ఉంటే రామ్ కెరీర్ లో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత మాస్ సినిమా అయితే చేయ‌లేదు. సినిమాకు వ‌స్తున్న వ‌సూళ్లు చూసి ఇప్పుడంతా నోరెళ్లబెడుతున్నారు. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 18 కోట్ల షేర్ వ‌సూలు చేసి లాభాల్లోకి వ‌చ్చేసింది. నాలుగో రోజు నుంచి అన్నీ లాభాలే.. పూరీ ఇన్ని రోజుల నుంచి క‌లగంటున్న విజ‌యం కూడా ఇదే. డైలాగులు.. యాక్ష‌న్.. మాస్ ర‌చ్చ ఇవ‌న్నీ క‌లిపి ఇప్పుడు ఇస్మార్ట్ రేంజ్ మార్చేసాయి. క‌చ్చితంగా ఈ సినిమా త‌ర్వాత ఇప్పుడు రామ్ రేంజ్ కూడా మారిపోవ‌డం ఖాయం. ఈ చిత్రం ఫుల్ ర‌న్ లో ఈజీగా 30 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. అయితే ఎంత పెద్ద విజ‌యం సాధించినా కూడా పూరీ మ‌రోసారి ఇదే ఫార్మాలా ఫాలో అయితే మాత్రం క‌చ్చితంగా దెబ్బ‌తిన‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి చూడాలిక‌.. ఇస్మార్ట్ మ‌త్తు పూరీని ఎప్పుడు వ‌ద‌ల‌నుందో..?

More Related Stories