మిస్టర్ కేకే.. వచ్చినంత సేపు పట్టలేదుగా పోవడానికి..?

పోయింది.. మళ్లీ పోయింది.. విక్రమ్ సినిమా మరోసారి పోయింది.. ఒకటి రెండు కాదు.. ఏకంగా పదేళ్లుగా ఒక్క బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్నాడు విక్రమ్. అప్పుడెప్పుడో వచ్చిన అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ లేదు ఈ హీరోకు. మధ్యలో వచ్చిన దైవతిరుమగన్.. ఐ.. ఇరుముగన్.. లాంటి సినిమాలు కమర్షియల్ గా సేఫ్ అయ్యాయి కానీ విక్రమ్ కోరు కునే బ్లాక్ బస్టర్లు కావు అవి. ఈ మధ్యే వచ్చిన సామి 2 డిజాస్టర్ అయిపోయింది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే మరోసారి షాక్ తిన్నాడు. ఈయన నటించిన మిస్టర్ కేకే కూడా దారుణమైన టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం కూడా డిజాస్టర్ వైపు అడుగులు వేస్తుంది. ఇన్నాళ్లూ ఈ సినిమా ఉందనే ధైర్యంతో ఉన్న విక్రమ్ ను ఇది కూడా ముంచేసింది. విక్రమ్ లాంటి టాలెంటెడ్ నటుడికి ఈ బ్యాడ్ టైమ్ రావడం అభిమానులను కూడా బాధలో ముంచేస్తుంది. కానీ ఏం చేస్తాం.. అభిమానులు బాధ పడి వదిలేస్తారు. కానీ ఫామ్ లోకి రావాల్సిన బాధ్యత మాత్రం విక్రమ్ దే. పైగా విక్రమ్ లాంటి టాలెంటెడ్ హీరో కూడా రొటీన్ కథలకు అలవాటు పడటం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. విక్రమ్ లాంటి హీరో నుంచి రావాల్సిన సినిమా ఇది కాదంటూ పెదవి విరిచారు అభిమానులు. మిస్టర్ కేకేలో అసలు కథ కూడా లేదు. ఎందుకు విక్రమ్ అలా మారిపోయాడో ఎవరూ చెప్పరు.. ఆయన్ని ముందు నుంచే క్రిమినల్ అంటారు.. ఆ లోపే రా ఏజెంట్ అంటారు. అలా క్లారిటీ లేని కథతో ప్రయాణం చేసాడు దర్శకుడు రాజేష్. కానీ చివరికి ఏం చెప్పాలనుకున్నాడో అది కూడా చూపించలేకపోయాడు. దాంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ అయిపోయింది. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆయన శిష్యుడు రాజేష్ దీనికి దర్శకుడు. విక్రమ్ ట్రాక్ రికార్డుతో పనిలేకుండా భారీగానే ఖర్చు చేసినా ఇప్పుడు సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూసి ఫ్యాన్స్ కు ఏడుపు మాత్రమే తక్కువవుతుంది.