English   

మెగా హీరో సినిమా ఆగిపోయిందా ?

Kalyan dev
2019-07-22 09:07:22

ఈ మధ్యనే మెగా హీరోల జాబితాలో చేరిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే మొదటి సినిమా బాగానే ఉన్నా అది అనుకున్నంత పేరు తెచ్చిపెట్టలేకపోయింది. గతేడాది చివరిలో కళ్యాణ్ దేవ్ తన రెండవ సినిమాని ప్రారంభించాడు. పులి వాసు అనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రిజ్వ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి కాగా ఈ సినిమాని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రషెస్ చూసిన యూనిట్ కి డైలాగ్ వర్షన్ ఇంకా ఎమోషనల్ గా ఉండేలా చూడడానికి ప్రయత్నిస్తున్నారట. అందుకే ప్రస్తుతం స్క్రిప్ట్‌లో చిన్న మార్పులతో డైలాగ్‌ లని మళ్ళీ సవరించే పనిలో ఉన్నారని సమాచారం. పులి వాసు ప్రస్తుతం తన రచయితల బృందంతో డైలాగ్ వర్షన్ మీదనే కూర్చుని పని చేస్తున్నారట. ఆ పని అయ్యాక మళ్ళీ షూట్ కి వెళతారట, మరి ఈ సినిమాతో అయినా మెగా అల్లుడు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

More Related Stories