బాలీవుడ్ రీమేక్ కానున్న దక్షినాది సినిమా...కానీ !

మరో దక్షిణాది సినిమా బాలీవుడ్ రీమేక్ కాబోతోంది. అయితే ఈసారి తెలుగు నుండి కాదు తమిళ ఇండస్ట్రీ నుండి. హీరో సిద్ధార్ద్, బాబీ సింహా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా జిగార్తాండా, పెద్దగ అంచనాలు లేకుండా రిలీజయిన ఈ సినిమా క్కడ సూపర్ హిట్ గా నిలిచింది. పెట్టా ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు దక్కించుకోవడమే కాక పలు జాతీయ అవార్డులని కూడా కైవసం చేసుకుంది. కొత్త జోనర్ లో సాగే ఈ సినిమాని ఇప్పటికే తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్, తమిళ్ హీరో అధర్వ మురళి లీడ్ రోల్స్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వాల్మీకి పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని చాలా గ్యాప్ తర్వాత హారీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు రీమేక్‌లో బాబీ సింహా పాత్రని వరుణ్ తేజ్ పోషిస్తుండగా, సిద్ధార్ద్ పాత్రని అధర్వ పోషిస్తున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ కానుందనట. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియవాలా ఈ చిత్ర రీమేక్ రైట్స్ దక్కించుకున్నారని అంటున్నారు. ఇప్పటికే స్క్రిప్టింగ్ మీద పనులు జరుగుతున్నాయని, ఉడతా పంజాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన అభిషేక్ చౌబే ఈ సినిమాకి దర్శకత్వ బాద్యతలు నిర్వర్తిస్తారని అంటున్నారు. స్క్రిప్టింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. అయితే నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.