English   

మహేష్ తర్వాతి సినిమా ఆయనతోనేనా ?

Parasuram
2019-07-22 10:30:13

మహర్షి సినిమాతో బంపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మహేష్ తర్వాతి సినిమా ఏమిటి ? ఎవరితో ఉండబోతోంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన చాలా మంది కధలు విని, మనం చేస్తున్నామని అభయం ఇవ్వడమే, మహర్షి హిట్ ఇచ్చిన వంశీతో మరి సినిమా చేస్తానని ప్రామిస్ చేసిన మహేష్, 'గీతగోవిందం' ఫేమ్‌ పరశురామ్‌ కి కూడా మాట ఇచ్చారట. వీరిద్దరికే కాక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేం సందీప్ రెడ్డికి కూడా మహేష్ ఓకే చెప్పాడు దీంతో ఆయన ఎవరితో సినిమా చేస్తాడా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే వీరిలో పరశురామ్ తో సినిమానే ముందు చేసే  అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ కోసమే ఆయన మరే సినిమా మీదా దృష్ట పెట్టకుండా వెయిట్ చేస్తున్నాడని అందుకే ఆయనతోనే సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. అన్నీ సరిలేరు షూట్ అయిపోగానే గీతా ఆర్ట్స్‌ బ్యానర్ మీదనే ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.  మహేశ్‌ తర్వాతి సినిమా ఏంటి అనే విషయం మీద క్లారిటీ రావాలంటే మరికాస్త సమయం పట్టక తప్పేలా లేదు.

More Related Stories