English   

రామ్ గోపాల్ వ‌ర్మ‌ను పిచ్చోన్ని చేసిన పూరీ జ‌గ‌న్నాథ్.. 

RGV
2019-07-22 12:03:14

అవును.. ఇప్పుడు నిజంగానే రామ్ గోపాల్ వ‌ర్మ‌ను పిచ్చోడిగా మార్చేసాడు పూరీ. ఇప్పుడు ఈయ‌న పిచ్చి చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఎంత‌గా అంటే ఇస్మార్ట్ శంక‌ర్ చూసిన త‌ర్వాత వ‌ర్మ పూర్తిగా మాస్ అయిపోయాడు. ఓ పార్టీలో ఏకంగా బీర్ నెత్తిన పోసుకుని గ‌ట్టిగా హ‌గ్ చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాడు ఈయ‌న‌. పైగా దానికి కోట్ కూడా ఇచ్చాడు వ‌ర్మ‌. తాను పిచ్చివాన్ని కాద‌ని.. కానీ త‌న‌ను ఇస్మార్ట్ శంక‌ర్ పిచ్చి వాన్ని చేసింద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. పూరీతో పాటు ఛార్మిని కూడా గ‌ట్టిగా కౌగిలించుకుని ఎంజాయ్ చేసాడు వ‌ర్మ‌. అస‌లు వ‌ర్మ తాగి ర‌చ్చ చేసిన విధానం చూసి అంతా ఫిదా అయిపోయారు. త‌న సినిమా విజ‌యం సాధించిన‌పుడు కూడా నిజంగా వ‌ర్మ అంత‌గాఎంజాయ్ చేసాడో లేదో కానీ శిష్యుడి సినిమాను మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఇదే ఇండ‌స్ట్రీ అంతా హాట్ టాపిక్ అయిపోయింది. అస‌లు వ‌ర్మ ఎందుకు ఇంత‌గా రెచ్చిపోతున్నాడో అనేది అర్థం కావ‌డం లేదు. మొత్తానికి చూడాలిక‌.. ఇస్మార్ట్ శంక‌ర్ ర‌చ్చ పూర్త‌య్యే లోపు పూరీతో క‌లిసి ఇంకా వ‌ర్మ ఎంత అల్ల‌రి చేస్తాడో..? 

More Related Stories