English   

ఇస్మార్ట్ నువ్వు తురుం రా....ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

iSmart Shankar
2019-07-22 15:38:48

 

అవును ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూసిన ఎవరైనా ఈ మాట అనక మానరు. చానళ్ళ నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్, పూరీ జగన్నాథ్ లు కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్లు గట్టిగా వస్తున్నాయి. చాలా రోజుల తరువాత పూరీ జగన్నాథ్ మార్క్ సినిమా వర్కౌట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగోడుతోంది. జూలై 18న విడుద‌లైన ఈ సినిమా రిలీజయ్యి నాలుగు రోజులు గడిచాయి, అంటే ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. సినిమా ఫస్ట్ డేనే 8 కోట్లు కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 16 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలేవీలేక‌పోవ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ భారీ బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ లు లాభాలలోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఏరియా వైజ్ షేర్ ని పరిశీలిస్తే నైజాం 9.42 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా, సీడెడ్ 3.69 కోట్లు, నెల్లూరు 0.72 కోట్లు, కృష్ణ 1.34 కోట్లు, గుంటూరు 1.36 కోట్లు, వైజాగ్ 2.33 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.36 కోట్లు, వెస్ట్ గోదావరి 1.09 కోట్లు సాధించి టోటల్ ఏపీ & టీస్ షేర్ 21.31 కోట్లు వసూలు చేసింది. అయితే నాలుగు రోజుల్లోనే ఇంత కలెక్ట్ చేస్తే ఫుల్ రన్లో ఎంత రాబడుతుంది అనే అంశం ఆసక్తిగా మారింది.

More Related Stories