English   

రవితేజ సంచలన నిర్ణయం !

 Ravi Teja
2019-07-22 15:52:29

ఇండస్ట్రీలో ఇప్పుడు అందరికీ ఒక వార్త షాకింగ్ గా అనిపిస్తోంది. అదేంటంటే హీరో రవితేజ రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేయడమే. నిజానికి తన మార్కెట్‌ ఎంత తక్కువ ఉన్నా తన రేటు మాత్రం తగ్గించుకోని రవితేజ ఇప్పుడు అసలు రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేయడానికి పూనుకున్నాడు. అదేంటి అనుకుంటున్నారా ? నిజమే ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతితో 'మహా సముద్రం' సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడని వార్తలు వచ్చాయి. నిజానికి ఇప్పటికే ఈ సినిమా మొదలు కావాల్సి ఉంది. కానీ పారితోషికం విషయంలో వచ్చిన తేడాల వలన సినిమా డిలే అవుతుందని అంటున్నారు. అయితే రవితేజ ఎంతకూ తగ్గకపోవడంతో ఆయన రేంజ్ అమౌంట్ రెమ్యునరేషన్ తాను ఇవ్వలేనని నిర్మాత తేల్చి చెప్పాడట. అయితే 'మహా సముద్రం' కథ తనకి బాగా నచ్చడంతో, ఆ కథను వదులుకోవడం ఇష్టం లేని రవితేజ ముందు ఏమీ ఇవ్వద్దని సినిమా రిలీజయ్యాక లాభాల్లో వాటా ఇమ్మని అడిగాడట. ఆ విషయం విని ఓకే చెప్పిన నిర్మాత త్వరలోనే సినిమా మొదలు పెట్టనున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్‌ ఒక కీలక పాత్ర పోషించడానికి అంగీకరించాడని అంటున్నారు. 

More Related Stories