English   

రికార్డులు బద్దలు కొడుతున్న లయన్ కింగ్ !

THE LION KING
2019-07-22 16:13:49

తాజాగా విడుదలైన త్రీడీ యానిమేషన్ చిత్రం ది లయన్ కింగ్ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 1994లో కార్టూన్ చిత్రంగా విడుదలైన ది లయన్ కింగ్ సినిమా అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి ఆధరణ పొందింది. దీంతో 2019లో మరిన్ని హంగులతో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ది లయన్ కింగ్ త్రీడీ చిత్రాన్ని రూపొందించి విడుదల చేశారు. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. అయితే పాత సినిమానే అయినా అద్భుతమైన విజువల్స్ ఉండడం, మన తెలుగు సినిమా ప్రముఖులు కొందరు గాత్రం అరువివ్వడంతో ఈ సినిమా పిల్లల నుంచీ పెద్దల వరకూ ఆకట్టుకుంటోంది. మనుషుల మధ్య ఉండేలాగానే ఎమోషన్స్ చొప్పించడంతో చూసేవారికివిజువల్ ట్రీట్ లాగా అనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ఐన నాటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. మొట్టమొదటిసారిగా ఇంగ్లీషు డబ్బింగ్ ఫిల్మ్ నైజాంలో సత్తా చాటింది. అలాగే తెలుగు వర్షన్ ఒక్కదానికే లయన్ కింగ్  65.19 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అది కూడా విడుదలయిన మూడు రోజుల్లోనే. ఇది హాలీవుడ్ సినిమా చరిత్రలో తెలుగు ఓపెనింగ్స్ లో మూడో అత్యధిక ఓపెనింగ్స్ ఉన్న సినిమా ని అంటున్నారు. మొదటిది అవెంజేర్స్ ఎండ్ గేమ్ కాగా ఆ తర్వాత ఇంఫినింటీ వార్ నిలిచింది, ఇప్పుడు మూడో ప్లేస్ లో లయన్ కింగ్ నిలిచింది.  

More Related Stories