English   

తన మీద వచ్చిన విమర్శలకు తెలివిగా క్లారిటీ ఇచ్చిన నాగ్ ! 

Nagarjuna
2019-07-22 17:42:27

కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 నిన్న రాత్రి అట్టహాసంగా ప్రారంభమయింది. అయితే ఈ షో ఆయన హోస్ట్ చేస్తారనే వార్త బయటకు వచ్చిన నాటి నుండి, ఆయన ఈడ ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే గత సీజన్ సమయంలో ఆయన దేవదాస్ సినిమా రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఈ షో మీద కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ షో కాన్సెప్ట్ తనకు నచ్చలేదని ఈ షో అంటే ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ మూడో సీజన్ ఆయన చేస్తున్నారని తెలిసిన నాటి నుండి డబ్బు కోసమే ఆయన షో చేస్తున్నారని, మాట మీద నిలబడని వాడని రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలు అన్నిటికీ కలిపి నిన్న ఓపెనింగ్ రోజున నాగర్జున సమాధానమిచ్చారు. ఇప్పటికీ తనకు ఇష్టం అంటే ఇష్టం లేదని చెబుతూనే ప్రేక్షకులందరికీ ఎందుకు ఇష్టమో తెలుసుకుందామని తానే స్వయంగా రంగంలోకి దిగానని చెప్పుకొచ్చారు. మనసు కోతిలాంటిది కాబట్టే ఈ షో మీద ఎందుకు ఇంత క్రేజ్ నెలకొని ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. కానీ తారెడ్డి, నటి గాయత్రీ గుప్త చేసిన లైంగిక ఆరోపణల మీద మాత్రం నాగార్జున స్పందించలేదు.  

More Related Stories