రష్మిక మందన్నకు కాబోయే వాడు ఇలా ఉండాలంట తెలుసా..?

తెలుగులో ఇప్పుడు ఒకే హీరోయిన్ పేరు మాటిమాటికి వినిపిస్తుంది. అయినా ఇక్కడ ఒక్కో సీజన్ లో ఒక్కో హీరోయిన్ పంట పండుతుంది. ఇప్పుడు రష్మిక మందన్న సీజన్ నడుస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరస సినిమాలతో రప్ఫాడిస్తుంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అక్కడే తన మనసులో మాట కూడా బయట పెడుతుంది ఈ కన్నడ కస్తూరి. మరీ ముఖ్యంగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో ఈమెకు కుచ్ కుచ్ హోతా హై అనే వార్తలు వినిపిస్తున్నా కూడా తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటుంది రష్మిక. గీత గోవిందం తర్వాత ఈయనతో నటించిన రెండో సినిమా ఇది. జులై 26న విడుదల కానుంది డియర్ కామ్రేడ్. ఈ సినిమాతో పాటే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. నితిన్ భీష్మ సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ భామ. ఇక ఇదిలా ఉండగానే కాబోయే మొగుడి గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తనను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలో నోట్ చేసుకోండని చెప్పింది ఈ బ్యూటీ.
ఆయన తన ఇష్టాల్ని చెప్పినా చెప్పకపోయినా పర్లేదు కానీ నిజాయితీ ఉన్నవాడైతే చాలు అంటుంది ఈ బ్యూటీ. దాంతో పాటు అతడి ప్రవర్తన తనకు నచ్చాలని.. అన్నింటి కంటే ముందు మంచి మనసు ఉండాలని చెప్పింది రష్మిక. అంటే రక్షత్ శెట్టికి మంచి మనసు లేదా అంటూ ఈమెపై సెటైర్లు వేస్తున్నారు అభిమానులు. ఎందుకంటే 2017లో ఈ ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకుని ఆ తర్వాత విడిపోయారు. దీనికి కారణం విజయ్ దేవరకొండ అనే ప్రచారం కూడా ఉంది ఇండస్ట్రీలో. ఇవి అబద్ధాలు అని చెప్పినా కూడా అందులో ఎంతోకొంత నిజం ఉందనే వాళ్లు కూడా లేకపోలేరు. ఇక కాబోయే వాడిలో ఇంకొన్ని క్వాలిటీస్ కూడా చెప్పింది రష్మిక. ప్రతీ అమ్మాయి మాదిరే తనకు కూడా భర్తతో ఎక్కువ సమయం గడపాలని ఉంటుందని.. దానికి టైమ్ అతడి దగ్గర ఉండాలని కండీషన్ పెడుతుంది ఈ బ్యూటీ. తన దృష్టిలో రొమాంటిక్ అంటే వయసుతో పనిలేదని చెప్పింది ఈ బ్యూటీ. ఇలా అన్నీ ఉన్నవాడైతే తనకు పెళ్లి చేసుకోడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతుంది రష్మిక మందన్న. అయితే పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు తర్వాత అంటుంది ఈ కన్నడ బ్యూటీ.