స్టార్ హీరోలపై కసి తీర్చుకుంటున్న పూరీ జగన్నాథ్..

ఒక్క హిట్ వచ్చిందో లేదో తన ప్రతాపం చూపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ తీసుకొచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు సంచలన ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నాడు ఈయన. ముఖ్యంగా ఎప్పట్నుంచో తాను ప్లాన్ చేసుకుంటున్న జనగణమన సినిమాను ఇప్పుడు మరో హీరోతో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఇదిలా ఉంటే స్టార్ హీరోలపై కూడా కసి తీర్చుకుంటున్నాడు ఈయన. ఇకపై స్టార్ హీరోల కంటే కూడా కుర్రాళ్లతోనే సినిమాలు చేయడాలని పూరీ నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది. ఒకప్పుడు తాను ఎంతమందికి ఎన్ని విజయాలు అందించినా కూడా ఫ్లాపుల్లో ఉన్నపుడు ఎవరూ పట్టించుకోలేదనే బాధ ఈయనలో కనిపిస్తుంది. అందుకే ఇప్పట్నుంచి తన రూట్ మార్చుకుంటున్నాడు ఈ దర్శకుడు. కుర్ర హీరోలతోనే వరస సినిమాలు చేయాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా విజయ్ దేరవకొండతో చేయబోతున్నాడు ఈయన. మహేష్ బాబు కోసం రాసిన కథను ఇప్పుడు విజయ్ తో చేయడం అనేది సంచలనమే. కానీ ఆయనపై ఉన్న కోపమే ఇప్పుడు పూరీ ఇలా చేయడానికి కారణం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నమ్మకం లేక కథ బాగున్నా కూడా ఫ్లాపుల్లో ఉన్నాడని పక్కనబెట్టేసాడు మహేష్ బాబు. దాంతో ఇస్మార్ట్ హిట్ కొట్టి ఇప్పుడు తన దారి తాను చూసుకుంటున్నాడు పూరీ జగన్నాథ్. ఇప్పట్నుంచే తను తీసుకునే నిర్ణయాలు స్టార్ హీరోలకు షాక్ ఇస్తాయంటున్నాడు ఈయన. మొత్తానికి హిట్ వచ్చిన తర్వాత ఈయన దారి కూడా మారిపోయింది. మరి చూడాలిక.. ఇప్పట్నుంచి పూరీ వే ఎలా ఉండబోతుందో..?