అమలా పాల్ మరో హాట్ వీడియో.. ట్విట్టర్ లో వైరల్..

తమిళనాట ఇప్పుడు ఎవర్ని కదిపినా కూడా ఒకే సినిమా గురించి చర్చ నడుస్తుంది. అదే ఆడై.. తెలుగులో ఆమెగా విడుదలైంది ఈ చిత్రం. అమలా పాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని రత్న కుమార్ తెరకెక్కించాడు. ఇందులో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. న్యూడ్ సీన్స్ ఉన్నా కూడా ఎక్కడా అసభ్యంగా అనిపించలేదు ఈ చిత్రం. పైగా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ సినిమా విడుదలైన రోజు నానా రచ్చ జరిగింది. ఇలాంటి సినిమాలు రావడం సమాజానికి మంచిది కాదని కొందరు ఆపడానికి ప్రయత్నించినా చివరికి విడుదలైంది. నగ్నత్వం ఉన్నా ఉన్నా కూడా అమ్మాయిల సమస్యలపైనే ఈ చిత్ర కథను రాసుకున్నాడు దర్శకుడు రత్న కుమార్. ఇక ఇప్పుడు సినిమా చూసిన వాళ్లు కూడా అద్భుతంగా ఉందంటూ పొగిడేస్తున్నారు.
మరోవైపు అమలా పాల్ నటన కూడా ఈ సినిమాకు హైలైట్ అయింది. ఇక ఇప్పుడు ఈ చిత్ర ప్రమోషన్ బాధ్యతలు తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన ట్విట్టర్లో మరో న్యూడ్ వీడియో పోస్ట్ చేసింది అమలా పాల్. బిల్డింగ్ నుంచి ఓ అద్దం ముక్కను అడ్డుగా పెట్టుకుని బయటికి వస్తుంది అమలా పాల్. చుట్టు పక్కల చూస్తూ నడుస్తూ వస్తుంటుంది.. అంతలోపే అద్దం కూడా పగిలిపోవడంతో చిన్న ముక్క చేతిలో పట్టుకుని అలా తీక్షణంగా చూస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మొత్తంగా కథ నచ్చి ఏకంగా న్యూడ్ గా నటించడం అంటే చిన్న విషయం కాదు. కానీ అమలా పాల్ చేసిన ప్రయత్నానికి ఇప్పుడు మంచి మార్కులు పడుతున్నాయి.