సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సమంతా వైరల్ పిక్స్ !

విజయ్ సేతుపతి, త్రిష హీరోయిన్గా నటించి తమిళంలో రిలీజైన 96 మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోలీవుడ్ లో భారీ హిట్ నమోదు చేసుకుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. ఈ సినిమాలో నటించనున్నట్లు కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించినా చివరికి సమంతను ఎంపిక చేశారు. హీరోగా శర్వానంద్‌ను నటిస్తున్న ఈ సినిమాని తమిళ్ రీమేక్ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలోనే దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో జానుగా నటిస్తున్న సమంతా చూడిదార్ వేసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 96 సినిమాలో తమిళంలో త్రిష పోషించిన పాత్రను ఈ సినిమాలో చేస్తోంది. ఇప్పుడు అదే లుక్‌లో ఉన్న కొన్ని ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాకి జానూ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. అయితే దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.