English   

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? 

Jr NTR
2019-07-23 12:28:55

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి రోజు చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. ఈ చిత్ర విడుద‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉన్నా కూడా రోజు దీనిపై ఏదో ఓ వార్త బ‌య‌టికి వ‌స్తూనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో కూడా త‌న సినిమా గురించి ఏదో విధంగా మాట్లాడుకునేలా చేస్తూనే ఉంటాడు ద‌ర్శ‌క ధీరుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, చరణ్ న‌టిస్తుండ‌టంతో ఎక్క‌డ‌లేని ఆస‌క్తి క‌నిపిస్తుంది అంద‌ర్లోనూ. ఇక ఇందులో అల్లూరిగా చ‌ర‌ణ్.. కొమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే అలియా భ‌ట్ ఇప్ప‌టికే ఓ హీరోయిన్గా క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. రామ్ చ‌ర‌ణ్ తో ఈమె రొమాన్స్ చేయ‌బోతుంది. అయితే ఎన్టీఆర్ హీరోయిన్ పై మాత్రం ఇప్ప‌టికీ వేట సాగుతూనే ఉంది. ఇందులో ఈయ‌న కోసం ఫారెన్ బ్యూటీని తీసుకోవాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఆ క్ర‌మంలోనే అప్ప‌ట్లో ఓ హీరోయిన్ ను క‌న్ఫ‌ర్మ్ చేసినా ఆ త‌ర్వాత కొన్ని అనివార్య కార‌ణాల‌తో ప‌క్క‌కు త‌ప్పుకుంది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ జోడీగా మ‌రో విదేశీ భామ‌ను ఎంపిక చేసార‌ని తెలుస్తుంది. హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా రాబర్ట్స్ కు క‌థ చెప్పి ఒప్పించాడు రాజ‌మౌళి. ఆమె నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్ రావ‌డంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ ఆనందంగా క‌నిపిస్తున్నారు. హాలీవుడ్ లో వైల్డ్‌ ఛైల్డ్‌, నెర్వ్ లాంటి సినిమాల్లో న‌టించింది ఈమె. హాలీవుడ్లో అంత పాపులర్ కాకపోయినా రాజమౌళి మాత్రం త‌న క‌థ‌కు ఈమె స‌రిపోతుంద‌ని భావిస్తున్నాడు. అంతేకాదు.. ఎన్టీఆర్, ఎమ్మా మధ్య వచ్చే స‌న్నివేశాలు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు రాజ‌మౌళి. 

More Related Stories