English   

నాని రచయితగా మారాడా ?

 Nani
2019-07-23 12:47:49

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గ్యాంగ్ లీడర్. వైవిధ్యమైన సినిమాలను మాత్రమే తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కొత్త కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టీజర్ రేపు విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు హీరో నాని. నిన్న తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఈ సినిమాలో నా పెన్ నేమ్ పెన్సిల్ అని, పెన్సిల్ మరియు అతని గ్యాంగ్ ని ఈనెల 24న కలుసుకోండి, ఈ సినిమా ఎంతో ఫన్నీగా ఆకట్టుకుంటుంది అంటూ అయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజానికి చాలా మంది కవులు, రచయితలు కలం పేర్లు అదేనండీ పెన్ నేమ్స్ పెట్టుకుంటారు. అలాగే నాని కూడా రచయిత అయ్యుంటారు ! అందుకే ఆయన కూడా తన పెన్నుకో పేరు పెట్టుకోవాలనుకుంటున్నారని అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా నటి లక్ష్మి, ప్రియదర్శి, అనీష్ కురువిల్లా, శరణ్య, రఘుబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు, ఇక ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ కార్తికేయ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

More Related Stories