English   

డిస్కోరాజా సెట్ కాస్ట్ ఎంతంటే ?

Disco Raja
2019-07-23 14:59:02

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐఆనంద్ దర్శకత్వంలో నేల టికెట్ సినిమా నిర్మించిన ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్న తాజా సినిమా డిస్కోరాజా. ప్రతుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శరవేగంగా జ‌రుగుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ లో కోటి 20 ల‌క్షల రూపాయిల ఖర్చుతో నిర్మించిన సెట్‌లో షూటింగ్ జ‌రుపుతున్నారు. ఈ సినిమాకి ఈ సెట్ చాలా ముఖ్యమైనదని అంటున్నారు. ఈ షెడ్యూల్‌లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌ ల మీద సినిమాలో అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారట. అయితే త్వరలో ఈ యూనిట్ మొత్తం ఢిల్లీలో షూట్ కోసం వెళ్ళ బోతున్నారని సమాచారం. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ లు హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్ ఈనెల 26తో పూర్తవుతుందని చెబుతున్నారు. ఢిల్లీ షెడ్యూల్‌ లో హీరోయిన్ నభా నటేష్ జాయిన్ అవుతారని సమాచారం. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులన్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ నటుడు బాబీ సింహా ముఖ్య పాత్ర పోషిస్తుండగా ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 

More Related Stories