English   

కొత్త కాపీ వివాదంలో ఇస్మార్ట్....కధ నాదే అంటూ మీడియాకెక్కిన హీరో ! 

ismart shankar
2019-07-23 15:56:05

ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వ కారణం, ఏ సినిమా కొంచెం మంచి క్రేజ్ తెచ్చుకుంటుందో ఆ సినిమా మీద కాపీ వివాదాలు రావడం కామన్ గా మారింది. తాజాగా అలాంటి వివాదమే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రామ్ తో కలిసి పూరీ చేసిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ కొట్టింది. అయితే చాలా ఏళ్ల తరువాత కొట్టక కొట్టక పూరీ జగన్నాథ్.. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో ఓ హిట్ కొడితే ఆ కథ నాదే పూరీ కాపీ కొట్టేశారని అంటూ హీరో ఆకాశ్ మీడియాకెక్కడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆనందం’ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వత వరుస ఫ్లాప్స్ తో సినిమాలు చేయడమే మానేశాడు ఆకాశ్. అయితే ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్చే కాన్సెప్ట్‌తో తెలుగు-తమిళ భాషల్లో లేడీ డైరెక్టర్‌ రాధ ఆకాశ్ ని హీరోగా పెట్టి సినిమా తీశారని, నాన్‌ యార్‌ అనే పేరుతో ఇప్పటికే తమిళలో ఈ సినిమా విడుదల కాగా, 'కొత్తగా ఉన్నాడు' పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈలోపు ఇలాంటి మూలకథతో 'ఇస్మార్ట్‌ శంకర్‌' రిలీజ్‌ కావడం షాకింగ్ గా ఉందని ఆకాష్‌ పేర్కొన్నారు. నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆకాష్‌ మాట్లాడుతూ పూరి జగన్నాథ్‌ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని, అందుకే తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి కనీసం మీడియాకి తెలియచేయాలి అని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే చట్టాన్ని ఆశ్రయించాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఇస్మార్ట్ శంకర్ కథ ఇంగ్లీష్ సినిమా ఐన క్రిమినల్ మూవీ నుండి కాపీ కొట్టారని ఆ సినిమా నుండి ఒక లైన్ తీసుకుని కథ డెవలప్ చేశారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ఈ కధ నాదే అని ఆకాశ్ పేర్కొనడం సంచలనంగా మారింది.  

More Related Stories