English   

కాజ‌ల్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది.. డిజిట‌ల్ లోకి సుస్వాగ‌తం.. 

Kajal Aggarwal
2019-07-23 16:04:42

ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న వాళ్లంద‌రి చూపు నెక్ట్స్ డిజిట‌ల్ వైపు మ‌ళ్లుతుంది. ఎందుకంటే ఫ్యూచ‌ర్ అంతా డిజిట‌ల్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే ముందు జాగ్ర‌త్త‌గా అంతా సినిమాల నుంచి డిజిట‌ల్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్స్ చాలా మంది అక్క‌డ త‌మ స‌త్తా చూపిస్తున్నారు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి కూడా ఇదే న‌డుస్తుంది. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా డిజిట‌ల్ వైపు అడుగులు వేస్తుంది. ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో దుమ్ము దులిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లోనే డిజిటల్‌ రంగంలో త‌న‌దైన ముద్ర వేయ‌డానికి చూస్తుంది. అక్క‌డ భారీ రెమ్యునరేషన్స్ ఇస్తుండ‌టంతో అక్క‌డ కూడా త‌న అడుగు వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది కాజ‌ల్. పైగా అక్క‌డ సినిమాల‌కు క‌ష్ట‌ప‌డినంత కూడా అవ‌స‌రం లేదు.. డేట్స్ కూడా త‌క్కువ‌గానే అడుగుతుంటారు. ఎలా చూసుకున్నా కూడా సినిమా కంటే త‌క్కువ క‌ష్టంతో ఎక్కువ డ‌బ్బులు వ‌స్తుంటే ఎవ‌రు మాత్రం ఎందుకు వ‌దులుకుంటారు.. ఇప్పుడు చంద‌మామ కూడా ఇదే చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు వెంకట్ ప్రభు ఇప్పుడు ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. ఎలాగూ ద‌ర్శ‌కుడిగా ఈయ‌న‌కు కావాల్సినంత ఇమేజ్ ఉంది. 10 ఎపిసోడ్లుగా రాబోయే ఈ సీరిస్ కోసం భారీ పారితోషికం అందుకోబోతుంది కాజ‌ల్. ఇది ఆగస్ట్‌లో ప్రారంభించి.. సెప్టెంబర్‌లో పూర్తి చేస్తార‌ని తెలుస్తుంది. మొత్తానికి సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేసి స్టార్ అనిపించుకున్న కాజ‌ల్.. వెబ్ సిరీస్ లో ఏ మాత్రం మాయ చేస్తుందో చూడాలి. 

More Related Stories