English   

డియ‌ర్ కామ్రేడ్ తో అర‌డ‌జ‌న్ సినిమాలు పోటీ.. విజ‌య్ ఏం చేస్తాడో..? 

Dear Comrade
2019-07-23 17:57:47

టాక్సీవాలా త‌ర్వాత 8 నెల‌ల‌కు పైగా గ్యాప్ తీసుకుని డియ‌క్ కామ్రేడ్ సినిమాతో వ‌స్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించాడు. గీత‌గోవిందం త‌ర్వాత మ‌రోసారి రష్మిక మంద‌న్న ఈ చిత్రంలో విజ‌య్ తో రొమాన్స్ చేసింది. ప్రేమ‌క‌థ‌తో పాటు విధ్యార్థుల స‌మ‌స్య‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు భ‌ర‌త్. ఇందులో విజ‌య్ పాత్ర కూడా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. జులై 26న ఈ సినిమా విడుద‌ల కానుంది. అయితే ఆ రోజు మ‌రో అర‌డ‌జ‌న్ సినిమాలు కూడా విజ‌య్ సినిమాతో పాటు వ‌స్తున్నాయి. తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల్లో కూడా అదే రోజు విడుద‌ల కానుంది ఈ చిత్రం. దాంతో ఇత‌ర భాష‌ల్లో వేర్వేరు సినిమాల‌తో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తెలుగులో ఈయ‌న‌కు పెద్ద‌గా పోటీ లేక‌పోయినా కూడా తమిళంలో మాత్రం స్టార్ కమెడియన్ సంతానం నటించిన ఏ 1.. నయనతార న‌టించిన కొలైయుధిర్ కాలం.. దర్శకుడు సముద్రఖని నటించిన కొలాంజి.. నుంగంబాకం.. చెన్నై పళని మార్స్.. ఆరడి సినిమాలు జులై 26నే విడుద‌ల కానున్నాయి. వీటిలో సంతానం, న‌య‌న‌తార సినిమాల‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక మ‌ళ‌యాలంలో కూడా ఈ వారం కొన్ని సినిమాలు విడుద‌ల కానున్నాయి. మొత్తానికి విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌న‌భాష‌లో ఓకే కానీ ఇత‌ర భాష‌ల్లో ఎలా క‌వ‌ర్ చేస్తాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి చూడాలిక‌.. డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో..

More Related Stories