పాయల్ ప్రేమలో పడిందా ?

ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ కొట్టిన పాయల్ రాజ్ పుత్ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ సరసన కథానాయికగా, రవితేజ డిస్కోరాజా చిత్రంలో ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాక ఆర్డీఎక్స్ లవ్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోను నటిస్తుంది. అలా అస్సలు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలతో పాటు సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఫొటోకు మూడు లవ్ సింబల్స్‌ని జత చేసింది. ఈ దెబ్బకి నెటిజన్లు ఈ అమ్మడు ప్రేమలో పడిందని చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. . అయితే దీనిపై పాయల్ రాజ్ పుత్ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే పాయల్ స్పందించాల్సిందే.