English   

వాల్మీకి రిలీజ్ డేట్ క‌న్ఫ‌ర్మ్.. వ‌రుణ్ తేజ్ వ‌చ్చేదెప్పుడంటే..?

valmiki
2019-07-23 19:56:19

వ‌రుణ్ తేజ్ అంటే ఇప్ప‌టి వ‌ర‌కు అందంగా.. గ్లామ‌ర్ గా క‌నిపించాడు. ఎఫ్ 2 లాంటి సినిమాల్లో అయితే అమ్మాయిలు ఈయ‌న్ని చూసి ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం వాల్మీకి ప్రీ టీజ‌ర్ చూసిన త‌ర్వాత వ‌రుణ్ తేజ్ ను చూసి భ‌య‌ప‌డ‌తారంతా. అంత‌గా ఈ చిత్రం కోసం మారిపోయాడు మెగా వార‌సుడు. ఆ మ‌ధ్య ప్రీ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు భారీగా పెంచేస్తుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై ముందు నుంచి కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు సినిమా విడుద‌ల తేదీ కూడా క‌న్ఫ‌ర్మ్ అయింది. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుదల కానుంది. తాజాగా ఈ పోస్ట‌ర్ కూడా విడుదల చేసాడు ద‌ర్శ‌కుడు. పైగా త‌మిళ‌నాట భారీ విజ‌యం సాధించిన జిగ‌ర్తాండ సినిమా రీమేక్ కావ‌డంతో ఆస‌క్తి పెరిగిపోతుంది. ఇందులో నెగిటివ్ కారెక్ట‌ర్ చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. అక్క‌డ బాబీ సింహా చేసిన పాత్ర ఇది. ఇక సిద్ధార్థ్ పాత్ర‌లో త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి న‌టిస్తున్నాడు. డిజే త‌ర్వాత మ‌రోసారి హ‌రీష్ శంక‌ర్ త‌న సినిమాలో పూజా హెగ్డేకు ఆఫ‌ర్ ఇచ్చాడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రీ టీజ‌ర్లో వ‌రుణ్ తేజ్ ను చూసి అంచ‌నాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. క‌చ్చితంగా ఈ చిత్రంతో మ‌రో విజ‌యం అందుకుంటాన‌ని ధీమాగా చెబుతున్నాడు మెగా హీరో.

More Related Stories