English   

డియ‌ర్ కామ్రేడ్ బాలీవుడ్ రీమేక్ క‌న్ఫ‌ర్మ్.. స్టార్ డైరెక్ట‌ర్ ట్వీట్..

dearcomrade
2019-07-23 20:22:55

డియ‌ర్ కామ్రేడ్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్రం జులై 26న విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందించాడు. దాదాపు 40 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. తెలుగుతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్. ఈ మేర‌కు ఆయన ట్వీట్ కూడా చేసాడు. డియ‌ర్ కామ్రేడ్ సినిమాను విడుద‌ల‌కు ముందే నేను చూసాను.. నాకు బాగా న‌చ్చింది.. అందుకే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాను అంటూ ట్వీట్ చేసాడు ఈయ‌న‌. క‌ర‌ణ్ జోహార్ తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మైత్రి న‌వీన్ ఫోటో దిగి పోజులిచ్చారు. ఈ చిత్రం క‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు విజ‌య్. అస‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హిందీలో కూడా మంచి ఇమేజ్ ఉంది. అర్జున్ రెడ్డి రీమేక్ తో మ‌నోడి సినిమాల‌పై ఎక్క‌డలేని ఆస‌క్తి పెరిగిపోయింది అక్క‌డ‌. ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ కూడా ఉత్త‌రాదికి వెళ్తుంది.

More Related Stories