English   

ఇప్పుడు ముత్తయ్య వంతు...హీరో ఎవరంటే ?

cric
2019-07-23 21:47:17

ప్రస్తుతం బయోపిక్ ల హవా బాగానే నడుస్తుంది. సినీ ప్రముఖులు, క్రీడాకారులు అలాగే పొలిటికల్ లీడర్స్ బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే కపిల్ దేవ్ బయోపిక్ తెరకేక్కిస్తుండగా అందులో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కనుందని అంటున్నారు. శ్రీలంక బౌలర్లలో తనదైన మార్క్ వేసుకున్న మురళీధరన్ ప్రపంచవ్యాప్తంగా వన్డే టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు మ్యాచుల్లో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ కే దక్కింది. టెస్ట్ క్రికెట్లో మురళీధరన్ తీసిన వికెట్ల సంఖ్య 800 కాగా ఈ సినిమాకి అదే టైటిల్ గా ఫిక్స్ చేశారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్ర పోషించబోతున్నారని అంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆఖరు నుంచి  మొదలవనుందని అంటున్నారు.  ఇండియాతో పాటు, శ్రీలంక, ఇంగ్లాండ్‌ లలో షూటింగ్ జరుపనున్నారని సమాచారం. ఈ సినిమా దర్శకుడు అలాగే మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

More Related Stories