English   

చరణ్ కి మళ్ళీ గాయం…. క్లారిటీ ఇచ్చిన యూనిట్ !

ram
2019-07-24 07:19:33

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా  షూటింగ్  గతేడాది మొదలయింది. అయితే ఈ షూటింగ్ లో ఒక సారి రామ్ చరణ్ గాయపడగా మరోసారి ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే అలా ఏదో ఒక కారణం వల్ల ఆగుతున్న ఈ సినిమా కాస్త ఇప్పుడే ట్రాక్ లో పడిందని అనుకుంటుండగా మళ్లీ చరణ్ కి గాయం అయ్యిందని ప్రచారం మొదలైంది. అయితే అదంతా నిజం కాదని సినిమా యూనిట్ నుండి ఒక ప్రకటన వెలువడింది. నిన్న కూడా ఆయన షూట్ లో పాల్గొన్నారని ఆయనకు గాయాలే మీ కాలేదని యూనిట్ చెబుతోంది.

అయితే ఈ ప్రచారం ఒక జాతీయ మీడియా కధనం వలన మొదలయింది. ఆ కధనం ప్రకారం చరణ్ కి గాయమైందని, కానీ అది పెద్ద గాయమేమి కాదని పేర్కొ్నారు. మరో పక్క ఈ సినిమాలో ఎన్టీ అర్ సరసన మరో ఇంగ్లీష్ భామను సెలెక్ట్ చేశారని వార్తలు వస్తున్నా వాటి మీద మాత్రం యూనిట్ స్పందించ లేదు. 
 

More Related Stories