English   

అనసూయ కధనం రిలీజ్ డేట్ లాక్ !

anu
2019-07-24 07:34:12

బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, నటుడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా కథనం. గాయత్రి ఫిలింస్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ మీద నరేందర్ రెడ్డి, శర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని నూతన దర్శకుడు రాజేష్ నాదెండ్ల తెరకెక్కించారు. ఈ సినిమా గురించి ఎప్పుడో మార్చ్ లో ఒక టీజర్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో దాదాపు అందరూ ఈ సినిమా గురించి మర్చిపోయారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఆగష్టు నెలలో రెండో శుక్రవారం అయిన ఆగస్ట్ 9న రిలీజ్ డేట్ లాక్ చేసుకుందీ సినిమా. ఈ సినిమాలో అనసూయ ఒక సినిమా రచయితగా నటించింది, ఆమె రాసిన కధ ఉన్నది ఉన్నట్టు బయట కూడా జరుగుతూ ఉంటుంది. గతంలో ఈ పాయింట్ మీద కొన్ని సినిమాలు వచ్చి హిట్స్ కూడా అయ్యాయి. అందుకే ఈ సినిమా కూడా హిట్ కొడుతుందని నమ్ముతున్నారు యూనిట్. ఇప్పటికే అనసూయ నటించిన క్షణం, రంగస్థలం సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అయితే ఆమె హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుంది.  ఈ సినిమాలో అన‌సూయతో పాటు ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మరి అనసూయకి హాట్రిక్ దొరుకుతుందో లేదో వచ్చే నెలలో తెలిసిపోనుందన్న మాట.

More Related Stories