విజయ్ కి అంత సీన్ లేదంటున్న రష్మిక

రష్మికా మందన్నాతో విజయ్ దేవరకొండ లవ్‌లో ఉన్నాడంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మొదటి సినిమాలో ముద్దు సీన్ కారణంగానే రష్మికా రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా రద్దు చేసుకుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే, తాజాగా డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదేమీ లేదని విజయ్ చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తే రష్మిక మాత్రం అదో రకంగా సమాధానం ఇచ్చింది. చాలా మంది తమ మధ్య రిలేషన్ ఉందని అందుకే రెండో సినిమా చేసామని అంటున్నారని, విజయ్ కోసం సినిమా చేసేంత సీన్ అతనికి లేదని చెప్పుకొచ్చింది. స్క్రిప్ట్ నచ్చింది కాబట్టే డియర్ కామ్రేడ్' చేశానని ఆమె పేర్కొంది. హీరో ఎవరైనా సరే స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తానని దర్శకుడు భరత్ కథ చెబుతున్నప్పుడు నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగి, లిల్లీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, స్వీట్‌గా అనిపించి సినిమా చేశానని అంతే తప్ప విజయ్ కోసమే చేశాననడం కామెడీగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో స్టేట్ క్రికెట్ ప్లేయర్‌గా నటించానని, ఈ సినిమా కోసం మూడు, నాలుగు నెలలు క్రికెట్ ప్రాక్టీస్ చేయడంతో క్రికెటర్ల కష్టం తెలిసొచ్చి వాళ్ళ మీద గౌరవం పెరిగిందని పేర్కొంది ఈ అమ్మడు. ఈ సినిమా తెలుగు, కన్నడ వెర్షన్స్‌కి నేనే డబ్బింగ్ చెప్పానని, కానీ తెలుగు డబ్బింగ్ చెప్పడానికి దాదాపు అరవై రోజులు పట్టిందని ఆమె చెప్పుకొచ్చింది. విజయ్ తో డేటింగ్ లో ఉన్నాననే వార్తల్లో నిజం లేదని, ఎందుకంటే అసలు డేటింగ్ చేయడానికి టైమ్ లేదని చెప్పుకొచ్చింది ఈ కన్నడ భామ.