రకుల్ రొమాన్స్ సీనియర్ హీరోతో కాదు కుర్ర హీరోతోనే ?

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే గత కొన్నాళ్ళగా పెద్దగా సినిమాలు ఒప్పుకోకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తున్న ఈ భామ ఏకంగా కమల్ హాసన్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారతీయుడు-2’ సినిమా పలు కారణాలతో ఆగింది. అయితే ఈ సినిమా వచ్చే నెల నుంచి తిరిగి సెట్స్‌మీదకు వెళ్లనుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెయిన్ లేడీ లీడ్. అయితే ఈ మధ్యనే తమిళ నటీమణులు ప్రియాభవానిశంకర్, ఐశ్వర్యరాజేష్లను కీలక పాత్రల కోసం ఎంపిక చేశారని వార్తలు రాగా మరో ముఖ్యపాత్ర కోసం రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న సిద్ధార్థకు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించబోతున్నదని చెబుతున్నారు. కానీ నిన్నంతా సీనియర్ హీరో తో రోమాన్స్ చేయనున్న రకుల్ అంటూ మీడియాలో రచ్చ రేగింది, కానీ రకుల్ రొమాన్స్ చేసేది కుర్ర హీరోతోనే అని అంటున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ‘భారతీయుడు-2’ లో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ విలన్ రోల్ పోషించబోతున్నారు.