అదిరిపోయే అందాల వేదిక.. బికినీలో రచ్చ రచ్చ..

వేదిక.. అంటే ఏదో స్టేజ్ అనుకోకండి. ఇక్కడ వేదిక అంటే హీరోయిన్ పేరు. ఒక్కసారి తెలుగులో అప్పుడెప్పుడో కళ్యాణ్ రామ్ నటించిన విజయ దశమి సినిమా గుర్తు చేసుకోండి.. లేదంటే లారెన్స్ ముని సినిమా గుర్తు చేసుకోండి చాలు.. అందులో ఉంటుంది వేదిక. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో చాలా సినిమాలు చేసినా కూడా ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ కన్నడలో మాత్రం బాగానే సెటిలైంది వేదిక. ఇక ఇప్పుడు అక్కడే ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ స్టార్ హీరోయిన్ అయిపోవాలని కలలు కంటుంది. కన్నడలో స్టార్ హీరోలు కూడా వేదికతో నటిస్తున్నారు. వరసగా ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ జోష్ లోనే వేదిక అందాల ఆరబోతలోనూ గేట్లు ఎత్తేసింది. తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయినా.. తాను ఇప్పటికీ ఉన్నానని గుర్తు చేయడానికి మెల్లగా గ్లామర్ షో లో హీట్ పెంచేస్తుంది వేదిక. తన పరువాలను ప్రేక్షకుల ముందు పరిచేస్తుంది. మరి ఈ గ్లామర్ షో చూసిన తర్వాతైనా ఏదో ఓ దర్శకుడు కరుణించకపోతాడా ఈ వేదికను..! అందుకే బికినీ షో కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బీచ్ ఒడ్డున బికినీ వేసుకుని ఇచ్చిన పోజు అదిరిపోయింది అంతే.