English   

గ్యాంగ్ లీడర్ టీజ‌ర్ : పెన్సిల్ విత్ గ్యాంగ్ రచ్చ ! 

Nanis Gang Leader
2019-07-24 13:46:09

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. విలక్షణ దర్శకుడు విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతోంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది సినిమా యూనిట్. అందులో భాగంగానే ప్రీ లుక్, ఫ‌స్ట్ లుక్ , సాంగ్ అంటూ ఈ సినిమాకి సంబంధించి ప‌లు రకాల అప్‌డేట్స్ ఇస్తూ వచ్చిన టీమ్ తాజాగా కొద్దిసేపటి క్రితం టీజ‌ర్ రిలీజ్ చేసింది. పెన్సిల్‌ గా నానిని అత‌ని గ్యాంగ్ ని ఈ టీజర్ లో పరిచయం చేశారు. పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకుంటాడు. ఈ రివెంజ్ రైటర్ సాయం తీసుకుని ఒకరి మీద రివెంజ్ తీసుకోవడం కోసం ఐదుగురు సభ్యులున్న లేడీ గ్యాంగ్ ఆయన్ను కలుస్తుంది. వారే బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను ఇలా ఐదుగురు ఆడవాళ్ల రివేంజర్స్ బృందం వస్తుంది. వీళ్లు నానిని కలవడం వాళ్లలో ఒకరైన హీరోయిన్‌ ప్రియాంకతో 'ఇక నుంచి నో లవ్ ఓన్లీ పగ.. పగ.. పగ.. ' అని చెప్పడం చూపించారు. హీరో కార్తికేయను కూడా ఒక ఫ్రేమ్‌లో ఎఫ్1 రేసర్ గా చూపారు.  ఇక ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ముందు చెప్పినట్టు ఆగ‌స్ట్ 30న ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే ! ఎందుకంటే ప్రభాస్స్ న‌టించిన సాహో సినిమా కూడా అదే రోజు విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో గ్యాంగ్ లీడ‌ర్ చిత్ర రిలీజ్ డేట్ మారుతుందనే వాదనలు వినిపుస్తున్నాయి.

More Related Stories