విశాఖలో ప్రీ రిలీజ్ చేస్తున్న డియర్ కామ్రేడ్ !

విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్స్ గా నటించిన తాజా మూవీ డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ సినిమాని జూలై 26న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు. రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ జరుపుతున్నారు. ఈ మధ్యలో నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించిన మ్యూజిక్ ఫెస్టివల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజున ప్రీ రిలీజ్ వేడుకని విశాఖ జిల్లా సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనునున్నారు. ఈ విషయాన్ని ముందే యూనిట్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో శృతి రామచంద్రన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. గీత గోవిందం సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్, రష్మిక జోడి మరోసారి స్క్రీన్ ఏమి మ్యాజిక్ చేయనుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ కూడా ప్రకటించడంతో ఈ సినిమా మీద అంచనాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో ?