English   

వెల్ క‌మ్ టూ అబ్రాడ్.. ట‌బుకు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్వాగ‌తం.. 

Tabu
2019-07-24 14:11:34

తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన మాజీ హీరోయిన్లను తన సినిమాల్లో తీసుకుంటాడు. వాళ్లకు కీలకపాత్రలు ఇస్తుంటాడు. వీలైతే ప్రతి సినిమాలో మాజీ హీరోయిన్లను తీసుకొని వాళ్లకు మంచి పాత్ర‌లు ఇస్తుంటాడు మాటల మాంత్రికుడు. చాలా ఏళ్ల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అత్తారింటికి దారేది కోసం ఒకప్పటి హీరోయిన్ న‌దియాను తీసుకొచ్చాడు. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తిలో ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ కీలక పాత్రలో నటించింది. మొన్నటికిమొన్న అజ్ఞాతవాసిలో కూడా పవన్ కళ్యాణ్ చిన్న‌మ్మ‌గా కుష్బూ నటించింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈమె సెట్లోకి అడుగు పెట్టింది. ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఆమెపై ఒక మేకింగ్ వీడియోను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వెల్కమ్ టు అబ్రాడ్ అంటూ టబుకు స్వాగతం పలికారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. విదేశాల్లో ఉన్నారు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్యాంగ్. ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు. పండక్కి మహేష్ బాబు సినిమా ఉన్న కూడా తాను కూడా రేస్ లోనే ఉన్నాను అంటున్నాడు అల్లు వారబ్బాయి. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫాంలోకి వస్తాడని చెబుతున్నాడు. నాపేరు సూర్య సినిమా ఊహించని ఫ్లాప్ అందుకుని రేసులో వెన‌క‌బ‌డిన బ‌న్నీకి ఈ చిత్రం కీల‌కంగా మారింది.

More Related Stories