రామ్ వాళ్లకు మామూలు పంచ్ వేయలేదుగా.. చచ్చిపోండిక..

ప్రతీ సినిమా విడుదలైన వెంటనే ప్రశంసలు, విమర్శలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ విషయంలో కూడా రెండూ ఉన్నాయి. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే 30 కోట్ల షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది. ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాకు టాక్ ఎలా ఉన్నా కూడా వసూళ్లు సంచలనంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే విజయంతో పాటు విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా రామ్ కారెక్టర్ పై ఇందులో చాలా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు రామ్ ఏకంగా దిమ్మతిరిగే సెటైర్ వేసాడు. అది కూడా తన సినిమాను విమర్శించే వాళ్లకు ఒకేఒక్క మాటతో నోరు మూయించాడు ఈ హీరో. ఎంతసేపూ అమ్మాయిలను కొడుతున్నాడు.. అమ్మాయిలను తిడుతున్నాడు.. వాళ్లకు గౌరవం ఇవ్వట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు కానీ అడ్డొచ్చిన వాళ్లను చంపేస్తున్నాడని ఒక్కరు కూడా కంప్లైంట్ చేయడం లేదు. మనిషి జీవితానికి అస్సలు విలువ లేవు.. వెరీ స్యాడ్ అంటూ ట్వీట్ చేసాడు రామ్. దీన్నిబట్టి తన సినిమాపై తానే అదిరిపోయే సెటైర్ వేసుకున్నాడు రామ్. వెరీ బ్యాడ్ ఆస్ కారెక్టర్ అంటూ ముగించాడు ఈయన. ప్రస్తుతం అమెరికాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు రామ్. వచ్చిన తర్వాత తర్వాతి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు ఈయన.