English   

కొనసాగుతూనే ఉన్న  ఇస్మార్ట్ శంకర్ వసూళ్ల పరంపర !

ram
2019-07-24 18:04:52

ఇస్మార్ట్ శంకర్ వసూళ్ల పరంపర కొనసాగుతుంది.  జూలై 18న విడుద‌లైన ఈ సినిమాకి కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని అంటున్నారు. వీకెండ్ లో వసూళ్ల వర్షం కురిపించిన ఇస్మార్ట్ శంకర్ సోమ, మంగళ వారాల్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. స‌రిగ్గా ఆరు రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వసూలు చేసి రచ్చ చేస్తోంది. చాన్నాళ తర్వాత పూరీ చేసిన మ్యాజిక్ కి రామ్ ప‌ర్‌ఫార్మెన్స్‌ తోడు కావడంతో ప్రేక్ష‌కులు సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. రిపీటేడ్ ఆడియన్స్ వెళ్ళడంతో సినిమాకి మంరింత కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జూలై 26న డియ‌ర్ కామ్రేడ్ చిత్రం విడుద‌ల కానుండ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ వ‌సూళ్ళ‌కి కాస్త బ్రేక్ ప‌డుతుందేమోన‌ని ట్రేడ్ వర్గాక వారు భావిస్తున్నారు. అయితే ఆ సినిమా థియేటర్లలోకి రావడానికి ఈరోజు రేపు రెండ్రోజుల గడువు ఉండటంతో కలెక్షన్స్ లో మరింత మెరుగవ్వచ్చని అంటున్నారు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్,నభా నటేష్ హీరోయిన్లుగా నటించగా పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరీ -చార్మి సంయుక్తంగా నిర్మించారు. 

More Related Stories