English   

ఇస్మార్ట్ కోసం వర్మ రచ్చ చేసింది అందుకా ?

rgv
2019-07-24 20:01:37

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సెన్సేషనల్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ గురువారం నాడు రిలీజయి ఇప్పటికే హాఫ్ సెంచరీ కొట్టేసి సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. అయితే చాన్నాళ్ళ తర్వాత తన సినిమా హిట్ కావడంతో పూరీ చార్మీతో కలిసి వర్మ కంపెనీకి వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ కి గురువు అనే పొజీషన్ తప్ప ఏమాత్రం సంబంధం లేని రామ్ గోపాల్ వర్మ అందరికంటే ఎక్కువ హడావిడి చేశారు. బళ్ళు వేసుకుని థియోటర్స్ కి వేలలో అక్కడ హల్ చల్ చేయడమే కాక యూనిట్ తో కలిసి మందు పార్టీ చేసుకుని, ఆ ఫొటోలు వీడియోలు పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేశాడు. అయితే ఇదంతా వర్మ తన శిష్యుడి మీద ప్రేమతో కావాలని చేసిన ప్రమోషన్ అని అనుకున్నారు అంతా. అయితే దీని వెనుక మరో కారణం ఉందని అంటున్నారు. అదేంటంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ హిట్ కొట్టినా ఇప్పటికిప్పుడు కాస్త మార్కెట్ ఉన్న హీరోలు వర్మతో సినిమా చేయడం కష్టం, సో ఎలా అయినా ఏదో ఒకటి చేసి హీరో రామ్ తో వర్మ సినిమా ప్లాన్ చేయాలను అనుకుంటున్నాడట. అందుకే ఈ రచ్చ చేశాడని, రామ్ ఇంకా ఒప్పుకోకున్న్డా  ఓకవేళ ఒప్పుకుంటే అది తన సినిమా మార్కెట్ చేసుకోడానికి ఉపయోగపడుతుందని భావించి ఇలా చేశాడని అంటున్న్నారు. ఎంతయినా అక్కడుంది వర్మ కదా.

More Related Stories