English   

మహేష్ విట్టని కర్రోడన్న టీమ్ మేట్స్....రచ్చ మొదలయ్యింది !

Bigg boss
2019-07-25 08:20:08

బిగ్ బాస్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి సగం టెన్షన్ తీరింది. ఇక వీళ్ళు ఎప్పుడు కొట్టుకోవడం మొదలు పెడతారా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులకి బ్రేకులు వేస్తూ, అప్పుడే కొట్టుకోవడం మొదలు పెట్టారు హౌస్ లోని సభ్యులు. లోపలి వెళ్లి ముచ్చటగా మూడు రోజులు అయ్యిందో లేదో అప్పుడే ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు చెడుగా మరొకరికి చెప్పుకోవడం మొదలుపెట్టారు. హౌస్‌లోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులూ చూస్తుంటే రాజకీయ నాయకులు ఎన్నికల ముందు తర్వాత ఎలా బిహేవ్ చేస్తారో అలానే చేస్తున్నారు. వంట అంటే తనకి ఇష్టం అని వంట గది అంతా తన అధీనంలో ఉండాలని హౌస్ లోకి వచ్చే ముందు నాగార్జునకి చెప్పి లోపలి వచ్చిన హేమ చేసిన టీ నీళ్లలా ఉందని, చక్కెర తక్కువైందని పోటీదారులు ఫిర్యాదు చేయడంతో ఆమె వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అందుకే తెచ్చారేమో అన్నట్టు వరుణ్ సందేశ్-వితికా జంట రొమాన్స్ మొదలెట్టింది. నిన్నటి టాస్క్‌లో భాగంగా ఎవరి బాల్యాన్ని వారు గుర్తు చేసుకుంటూ చిన్న పిల్లలుగా టీచర్లుగా వ్యవహరించాలని బిగ్ బాస్ కామెడీ టాస్క్ ఇచ్చారు. దీంతో ఇక 15 మంది కంటెస్టెంట్స్‌లో ఒక్క మహేష్ విట్టా తప్పా మిగిలిన 14 మంది ఒక రేంజ్ లో పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో పాల్గొనని మహేశ్ విట్టా తనకు ఓవర్ యాక్షన్ చేయడం ఇష్టం ఉండదని, సైలెంట్‌గా ఉంటానని ఓ పక్కన ఉండిపోయాడు. అయితే ఇది చూసిన రవికృష్ణ, రోహిణిలు పడుకుని ఉన్న మహేష్‌ని ఉద్దేశించి ఆ కర్రిగాడు ఊడపొడుస్తా అన్నాడు ఇప్పుడు పడుకున్నాడు గేమ్ ఆడటం లేదు అంటూ అతను బాధపడేలా మాట్లాడటంతో మహేష్ విట్టా సీరియస్ అయ్యాడు. తనను గాడు, గీడు అన్న పర్లేదు కానీ, కర్రోడు అంటే బాగుండదని వారిని హెచ్చరించాడు. దీంతో రవికృష్ణ సారీ చెప్పాడు. అయినా చల్లారని మహేశ్ తాను చిన్నప్పటి నుంచీ ఇలానే ఉన్నానని,  తనకు నచ్చని పని చేయనని చెప్పుకొచ్చాడు. తనను వాడు, వీడు అన్నా పర్లేదు కానీ, కర్రోడు అంటే కోపం రాదా? అని ప్రశ్నించాడు. అయితే టీచర్ గా ఉన్న పునర్నవి సర్ది చెప్పడంతో మహేశ్ శాంతించాడు. చూడాలి ఈరోజు ఏమి రచ్చ చేస్తారో ?

More Related Stories