English   

టాలీవుడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట తీవ్ర విషాదం !

srikanth
2019-07-25 10:37:38

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన ఇంద్రగంటి మోహన కృష్ణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి ప్రముఖ కవి, సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని తమ ఇంట్లో కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో మే 29 ,1944న జన్మించిన ఆయన, 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్‌ గా చేరారు. ఆపై ఆకాశవాణి కేంద్రానికి ఆయన విశేష సేవలందించారు. తాను రిటైర్ అయ్యే నాటికి ఎన్నో లలిత గేయాలు, కవితలు, సాహిత్య వ్యాసాలను అందించారు. అంతే కాక ఆయన రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలను కూడా రచించి మంచి పేరు తెచ్చుకున్నారు. కృష్ణావతారం, నెలవంక, రావు- గోపాలరావు లాంటి సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఇటీవల 'సమ్మోహనం' చిత్రంలో 'మనసైనదేదో' అనే రొమాంటిక్‌ సాంగ్‌ కూడా రాశారు. దీంతో పలువురు సెలెబ్రిటీలు మోహన్ కృష్ణకి తమా సంతాపాన్ని తెలియచేస్తున్నారు. 

More Related Stories