ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. రామ్ ఊహించని బ్లాక్ బస్టర్..

పూరీ జగన్నాథ్ తన ఆకలి మొత్తం ఒకేసారి తీర్చేసుకుంటున్నాడు. ఈయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ పై కసితీరా దండయాత్ర చేస్తుంది. ఈ సినిమా వచ్చి అప్పుడే వారం రోజులు అయిపోయింది. నాలుగు రోజుల వీకెండ్ చూసుకుని వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. భారీ వసూళ్లు రాబట్టాడు. ఏకంగా తొలి వారంలోనే 56 కోట్లకు పైగా గ్రాస్.. 30 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. విడుదలైన ఏడవ రోజు కూడా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల షేర్ వసూలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 30 కోట్లు వసూలు చేసి రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. దీనికి ముందు 20 కోట్ల రేంజ్ లోనే ఉన్నాడు రామ్. కానీ తొలిసారి ఈయన 30 కోట్లు మార్క్ దాటేసాడు. మాస్ ప్రేక్షకులకు నచ్చడంతో ఇస్మార్ట్ శంకర్ దూకుడు కొనసాగుతుంది.
ఇదే దూకుడు కొనసాగితే మరో 5 కోట్లు కూడా తెచ్చేలా కనిపిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ శంకర్ దండయాత్ర ఆగేలా కనిపించడం లేదు. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడం దీనికి బాగా కలిసొస్తుంది. మరోవైపు రామ్ మాస్ అవతారం.. పూరీ మార్క్ తెలంగాణ డైలాగులు థియేటర్లలో గోల పెట్టిస్తున్నాయి. దాంతో వరల్డ్ వైడ్ గా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ దూకుడు చూస్తుంటే అసలు రామ్ సినిమాకు ఇంత క్రేజ్ ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ రామ్ ఫ్యాన్స్ కంటే కూడా పూరీ ఫ్యాన్స్ ఎక్కువగా పండగ చేసుకుంటున్నారు. మాస్ సినిమాలకు టాక్ బాగా వస్తే కలెక్షన్లు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ చూపిస్తున్నాడు. ఫుల్ రన్ లో 40 కోట్ల మార్క్ అందుకుంటే అది సంచలనమే అవుతుంది.