బీజేపీలో చేరిపోయిన మాజీ హీరోయిన్.. ఎమ్మెల్యే రోజాపై కమెంట్స్..

సినిమా వాళ్లకు చివరి గమ్యం రాజకీయాలు తప్ప మరోటి కనిపించడం లేదు. అవకాశాలు రాకపోయినా.. లేకపోయినా కూడా వెంటనే వచ్చి పొలిటికల్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఇది చేసారు. కొందరైతే అక్కడ సినిమాల్లో బిజీగా ఉండి కూడా ఇటు రాజకీయాల వైపు వస్తున్నారు. ఇప్పుడు ప్రియా రామన్ కూడా ఇదే చేసింది. ఈమె ఒకప్పుడు తెలుగుతో పాటు మిగిలిన సౌత్ భాషల్లో కూడా బాగానే నటించింది. స్టార్ హీరోలతో కూడా నటించి ఔరా అనిపించింది. ఇక కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రియా.. ఈ మధ్యే రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తుంది. ఈ మధ్యలో సీరియల్స్ కూడా చేసింది ప్రియా రామన్.
ఇక ఇప్పుడు ఈమె రాజకీయాల్లోకి వచ్చేసింది. తాజాగా ఈమె కమల నాథుల పార్టీలో చేరిపోయింది. నరేంద్ర మోడీ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయనే తన రోల్ మోడల్ అని చెబుతుంది ప్రియా. అందుకే పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది ఈమె. ఇక రోజాపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ప్రియా రామన్. తనకు రోజా ఎదుగుదల బాగా నచ్చిందని చెప్పింది ప్రియా. ఆమె తనకు మంచి స్నేహితురాలే అని.. ఎప్పటికీ శత్రువు కాదు అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రాజకీయాల్లో పదవుల కోసం రాలేదని.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అంటుంది ప్రియా రామన్.