షాకిచ్చిన నాగార్జున...మన్మధుడు సీక్వెల్ కాదట !

ప్రస్తుతం తెలుగులో వస్తున్న దాదాపు అన్ని పెద్ద సినిమాలను కాపీ మరక వదలడం లేదు. మొన్నటికి మొన్న పూరీ ఇస్మార్ట్ సినిమా హాలీవుడ్ సినిమా క్రిమినల్ కి కాపీ అని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆ కధ నాదని ఆకాశ్ అనే నటుడు కూడా మీడియాకి ఎక్కాడు అనుకోండి అది వేరే విషయం. అయితే మన్మథుడు 2 విషయంలో కూడా దాదాపు అదే రకమైన విమర్శలు వచ్చాయి. మన్మథుడు 2 కూడా ఫ్రెంచ్ సినిమా ఒకదానిని బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారని విమర్శలు వచ్చాయి, మరి ఏమనుకున్నాడో ఏమో ఈ విషయాన్ని నాగార్జున కన్ఫాం చేశాడు. ఈ సినిమా మన్మధుడు సీక్వెల్ కాదని, ఒక ఫ్రెంచ్ సినిమా నచ్చి ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులు కొని ఈ సినిమా తీశామని నాగార్జున ప్రకటించాడు. అయితే అది ఏ విషయం అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే 2006లో ఫ్రెంచ్ లో రిలీజయిన ప్రేతే మెయి తామై ఆధారంగా మన్మథుడు 2 కథ రాహుల్ రవీంద్రన్ రాశాడని ప్రచారం జరిగింది. ఆ సినిమా లైన్ ప్రకారం హీరోకు 45 ఏళ్లొచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోడు ఇంట్లో వాళ్లు కూడా పెళ్లెప్పుడు అంటూ గొడవ చేయడంతో ఏం చేయాలో తెలియక ఓ అమ్మాయిని భార్యగా అద్దెకు తీసుకొస్తాడు. కానీ క్రమంగా నిజంగానే వాళ్లిద్దరూ ప్రేమలో పడిపోతారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కథతో ఇది వరకు చాలా సినిమాలు వచ్చినా, ఈ సినిమా విదేశీ నేపధ్యంలో ఉండనుందని అంటున్నారు. ఆగస్ట్ 9న మన్మథుడు 2 విడుదల కానుంది. మరి చూడాలిక ఈ సినిమా ఏ ఫ్రెంచ్ సినిమాకి రీమేకో అనేది.