English   

అల్లు అర్జున్ కి షాకిచ్చిన పోలీసులు !

Allu Arjun
2019-07-25 16:14:59

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే ఓ కారావ్యాన్ ను కొనుగోలు చేసి దానిని అల్ట్రా స్టైలిష్ గా తయారు చేసి దానికి ఫాల్కన్ అని పేరు కూడా పెట్టాడు. తాజాగా ఈ కారావ్యాన్ కి హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 16న టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల కారావ్యాన్ హిమాయత్ నగర్ ప్రాంతంలో వెళుతోండగా సిగ్నల్ పాడడంతో ఆగింది. ఈ నేపథ్యంలో అదే మార్గంలో వెళుతున్న మహమ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి దాన్ని గమనించి బస్సుకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ తో ఉండటాన్ని గమనించి ఫొటో తీసి దాన్ని ట్విట్టర్ లో సైబరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్యాగ్ ని ఫిర్యాదుగా భావించిన పోలీసులు ఆ వాహనం యజమాని అయిన అల్లు అర్జున్ కు రూ.735 జరిమానా విధిస్తూ చలాన్ పంపారు. ఈ మధ్యనే ట్రిపుల్ రైడ్ చేసి మరీ పోలీసులను కెలికిన రాంగోపాల్ వర్మ ప్రయాణించిన బండికి కూడా పోలీసులు ఇలానే జరిమానా విధించారు. గతంలో కార్లకి బ్లాక్ ఫిలిం ఉన్న నేపధ్యంలో ఎన్టీఆర్ కి కూడా పోలీసులు జరిమానా విధించారు, అంతే కాక అప్పటికి అప్పుడు ఆ బ్లాక్ ఫిలిం తొలగించేవారు కూడా.  

More Related Stories