English   

బన్నీ సినిమా టైటిల్ అదేనా ?

 Allu Arjun
2019-07-25 16:51:47

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వరుస పరాజయాలు ఎదురవ్వడంతో కొన్నాళ్ళ పటు సినిమాలు అన్నీ పక్కన పెట్టేసి, రెస్ట్ తీసుకున్నాడు. ఇక ఆయన ఇప్పుడు తనకి అచ్చి వచ్చిన త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు, ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ 19 అనే పేరుతోనే సంభోదిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఒక టైటిల్ కన్ఫాం చేసినట్టుగా చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ, ఈ విషయం మీద ప్రచారం అయితే మొదలయ్యింది. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధం అనే సబ్జెక్ట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ‘నాన్న.. నేను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. అయితే కొద్దిరోజుల క్రితం ఒక కో డైరెక్టర్ కి బన్నీకి గొడవ అయ్యి షూట్ ఆగిపోయిందని ప్రచారం జరగగా దానిని వ్యూహాత్మకంగా సీనియర్ నటి టబు నేటి నుండి షూట్ లో పాల్గొంటున్నారు అని చెప్పుకొచ్చింది.  బన్నీ సరసన పూజా హెగ్డే రెండోసారి జత కడుతుండగా.. సుశాంత్, నివేథా పేతురాజ్, నవదీప్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

More Related Stories