English   

మ‌ణిశ‌ర్మ‌ను ఇంకా లైట్ తీసుకుంటున్నారా చెప్పండి..? 

  Mani Sharma
2019-07-25 17:06:38

ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. స‌త్తా అయిపోయింద‌ని దూరం పెడితే ప‌ర్లేదు కానీ వ‌య‌సైపోయింద‌ని దూరం పెడితే మాత్రం క‌చ్చితంగా త‌ప్పే. ఇప్పుడు ఇదే జ‌రుగుతుందేమో అనిపిస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయిందంటే దానికి కార‌ణం మ‌ణి సంగీతం కూడా. ఆయ‌న అందించిన పాట‌లు ఇప్పుడు కుర్రాళ్ల‌ను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే డాన్సులు చేయిస్తుంది. ప‌దేళ్ల కాలంలోనే 110కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు మ‌ణిశ‌ర్మ‌. ఇప్ప‌టికీ త‌న‌లో ఆ స‌త్తా ఉంద‌ని నిరూపిస్తున్నాడు మ‌ణిశ‌ర్మ‌. కానీ స‌రైన అవ‌కాశాలు రావ‌డం లేదు. ఈ మ‌ధ్య స్టార్ హీరోల క‌న్ను ఈయ‌న‌పై లేదస‌లు. గ‌త రెండు మూడేళ్ల‌లో జెంటిల్ మెన్, దేవ‌దాస్, ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి సినిమాల‌కు మంచి సంగీత‌మే ఇచ్చాడు మ‌ణిశ‌ర్మ‌. 

ఈ మ‌ధ్య దేవీ, థ‌మ‌న్ కు తోడు కుర్ర సంగీత ద‌ర్శ‌కుల తాకిడి.. స్టార్ హీరోలు వీళ్ళ‌కు ప‌డిపోవ‌డంతో మ‌ణిశ‌ర్మ కాస్త సైలెంట్ అయిపోయాడు. ఇక ఇప్పుడు విడుద‌లైన ఇస్మార్ట్ శంక‌ర్ కు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు మ‌ణి. ముఖ్యంగా ఆర్ఆర్ కుమ్మేసాడు. పూరీ జ‌గ‌న్నాథ్ తో గ‌తంలో కూడా ప‌ని చేసాడు మ‌ణి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పూరీ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూనే ఉన్నాడు ఈయ‌న‌. ఇక ఇస్మార్ట్ శంక‌ర్ కు ఇచ్చిన మ్యూజిక్ చూసిన త‌ర్వాత కూడా మ‌ణిశ‌ర్మ‌ను ప‌క్క‌న‌బెడితే ఏం చేయ‌లేం. కానీ స్టార్ హీరోలు ఇప్ప‌టికైనా ఈయ‌న‌కు మ‌ళ్లీ బ్రేక్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు మ‌ణిశ‌ర్మ అభిమానులు. లేదంటే స‌త్తా ఉన్నా కూడా అలాగే మిగిలిపోతున్నాడు ఈయ‌న‌.

More Related Stories