English   

బ్రిడ్జ్ మీద పోరాటం చేస్తున్న ఆర్ఆర్ఆర్...నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే ?

 NTR Ram charan
2019-07-25 17:33:00

రాజ‌మౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమా యాక్ష‌న్ సీన్ చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో చ‌ర‌ణ్ గాయ‌ప‌డడంతో కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. మూడు వారాల త‌ర్వాత ఆయ‌న పూర్తిగా కోలుకోవ‌డంతో మ‌ళ్ళీ షూటింగ్ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ గాయపడడంతో మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. అయితే చరణ్ మ‌రోసారి గాయ‌ప‌డ్డాడంటూ ప్రచారం జరగడంతో చ‌ర‌ణ్ గాయ‌ప‌డ్డాడంటూ వ‌స్తున్న వార్త‌ల‌లో వాస్త‌వం లేదని, ఈ రోజు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారని ఆ సినిమా పీఆర్వో పేర్కొన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌ నగర శివారులో వేసిన బ్రిడ్జ్ సెట్‌ మీద పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే సినిమా యూనిట్ అంతా డెహ్రాడూన్ వెళ్లనుందని సమాచారం. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్‌ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారనీ అంటున్నారు. ఇప్పటికే సినిమాకి సంబందించిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ టీమ్ అంతా డెహ్రాడూన్ చేరుకున్నారని అక్కడ సెట్ పనులు కూడా మొదలు పెట్టారని చెబుతున్నారు.  ఈ మల్టీ స్టారర్ మూవీలో చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడిగా అమెరికన్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్ ను సెలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. ఈ సినిమా 2020 జులై 30 వ తేదీన రిలీజ్ అని ప్రకటించారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

More Related Stories