English   

వ‌రుణ్ సందేశ్, వితికా షెరూ రొమాన్స్ అద‌ర‌హో.. బిగ్ బాస్ లో ర‌చ్చ‌..

varun
2019-07-25 20:33:38

బిగ్ బాస్ రోజురోజుకు మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా అందులో భార్య భ‌ర్త‌ల‌ను పంపించడం ముందు నుంచి ఆసక్తికరంగానే ఉంది. ఇప్పుడు వరుణ్ సందేశ్, వితికా షేరూ జంట ఇంట్లో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. వాళ్ల ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తున్నారు. ముఖ్యంగా కెమెరాలు ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్లు పండిస్తున్న రొమాన్స్ బిగ్ బాస్ కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొస్తుంది. మాటిమాటికీ ముద్దులు పెట్టుకోవడం.. కెమెరా ముందే హగ్గులు చేసుకోవడం లాంటివి సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వితికా షేరూ అయితే వరుణ్ సందేశ్ కంటే కూడా అడ్వాన్స్ అవుతుంది. ప్రతి విషయాన్ని కెమెరా ముందుకు వచ్చి చర్చించడం ఈమెకు అలవాటుగా మారిపోయింది. దానికి తోడు భర్త కాబట్టి ఆయనతో మరింత క్లోజ్ గా ఉంటుంది. ఇవన్ని కెమెరాలు క్యాప్చర్ చేస్తున్నాయి. అయినా బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఇలా భార్య భర్తలను హౌస్ లోకి పంపించడం జరిగింది. సాధారణంగా కుటుంబాన్ని మొత్తం వదిలి పెట్టుకొని బిగ్ బాస్ లోకి వెళ్తుంటారు. కానీ వరుణ్ సందేశ్ అదృష్టం మాత్రం మరోలా ఉంది. పాటు బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీతో పాటు వచ్చాడు. పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుంటూ మరింత ఆసక్తి రేపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ జంట చేయబోయే రొమాన్స్ మరింత హైలెట్ కానుంది. అయితే ఈ వారం నామినేషన్ లిస్టులో వితికా పేరు కూడా ఉంది. ఆమెను సేవ్ చేయడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి తొలివారమే ఆమె ఇంటి నుంచి బయటకు వెళితే వరుణ్ సందేశ్ ప్రయాణం ఒంట‌రిగా చేయాల్సి వస్తుంది. అది ఎలా ఉండబోతుందో మరి.

More Related Stories