English   

ఇత‌ర సినిమాల‌ను ఇబ్బంది పెడుతున్న సాహో..

saaho
2019-07-25 21:19:00

సాహో సినిమా వాయిదా పడటం ఏమో కానీ ఇప్పుడు ఆ ప్రభావం మిగిలిన సినిమాలపై పడుతుంది. ఇప్పటికే తెలుగులో నాని నటిస్తున్న గ్యాంగ్ లీడ‌ర్ సినిమాపై ప్రభాస్ సాహో సినిమా చాలా ఎఫెక్ట్ చూపించింది. ఈ సినిమాను ఆగస్టు 30న విడుదల చేయాలని చాలా రోజుల నుంచి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీన్నిబట్టి షూటింగ్ కూడా పూర్తి చేశారు. ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడుతున్న సమయంలో సాహో సినిమా రెండు వారాల పాటు వాయిదా పడింది. అది కూడా తీరా వచ్చి నాని గ్యాంగ్ లీడర్ విడుదల కానున్న ఆగస్టు 30న కన్ఫర్మ్ చేసుకుంది. దాంతో ఇప్పుడు తన సినిమాను వాయిదా వేసుకోకుండా ఉండలేక పోతున్నాడు నాచురల్ స్టార్. సెప్టెంబర్ 13కు గ్యాంగ్ లీడర్ సినిమాను వాయిదా వేయడం ఉన్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ విషయంపై త్వరలోనే కన్ఫర్మేషన్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే తమిళనాట కూడా తన సినిమాతో మిగిలిన సినిమాలకు తిప్పలు తీసుకువచ్చి పెడుతున్నాడు ప్రభాస్. సాహో సినిమా కోసమే ఆగస్టు 15న రావాల్సిన సూర్య బందోబస్తు ఆగస్టు 30కి వాయిదా పడింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే డేట్ రోజు విడుదల తేది కన్ఫర్మ్ చేసుకోవడంతో తన సినిమాను మరోసారి వాయిదా వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు సూర్య. ఎందుకంటే తమిళనాట కూడా సాహో భారీ స్థాయిలో విడుదలవుతుంది. దాంతో ఈ సినిమాకు నష్టం కలగకూడదని తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడు సూర్య. మొత్తానికి సాహో విడుదల మిగిలిన సినిమాలకు తలనొప్పిగా మారుతోంది.

More Related Stories