English   

డియ‌ర్ కామ్రేడ్ ఫీవ‌ర్ లో తెలుగు ఇండ‌స్ట్రీ..

dear
2019-07-25 21:25:59

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో డియర్ కామ్రేడ్ ఫీవర్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లు అదిరిపోతున్నాయి. సిటీలోనే 310 షోలు పడుతుంటే దాదాపు 90 శాతం హౌస్ఫుల్ కావడం విజయ్ దేవరకొండ ఇమేజ్ కు నిదర్శనం. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో విజయ్ దేవరకొండ సినిమాలు తొలి రోజు వసూళ్లు కురిపిస్తున్నాయి. తెలుగుతో పాటు మిగిలిన మూడు భాషల్లో కూడా విడుదల అవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా ఫీవర్ కనిపించేలా 15 రోజుల నుంచి ప్రమోషన్ చేస్తున్నాడు రౌడీ హీరో. ఇప్పుడు దీనికి ఫలితం కనిపిస్తుంది. తెలుగులో అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం ఖాయం అయిపోయింది. దానికి తోడు తమిళ కన్నడ మలయాళ ఇండస్ట్రీలలో కూడా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఖాయంగా మారుతుంది. అక్కడ కూడా విజయ్ దేవరకొండకు ఇమేజ్ చాలానే ఉంది. ఇదే ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా ఓపెనింగ్స్ కు సాయపడేలా కనిపిస్తుంది. తెలుగులో 26 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా. తమిళ మలయాళ కన్నడ ఇండస్ట్రీలో మరో 8 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లు బిజినెస్ చేసింది. పాజిటివ్ టాక్ వస్తే ఈ వ‌సూళ్లు వెనక్కి తీసుకు రావడం విజయ్ దేవరకొండకు ఒక పెద్ద ఇష్యూ కాదు. ఇప్ప‌టికే గీతగోవిందం 70 కోట్లకు పైగా వసూలు చేసింది. దాన్ని ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ కూడా రిపీట్ చేస్తుంద‌ని నమ్ముతున్నాను దర్శక నిర్మాతలు.

More Related Stories