విజయ్ దేవరకొండ రాబోయే మూడు సినిమాలు ఇవే..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయనతో సినిమా చేయడానికి దర్శకులంతా క్యూ కడుతున్నారు. ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలని నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈయన రాబోయే తన మూడు సినిమాలను కన్ఫర్మ్ చేసాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ తోనే బిజిబిజీగా గడిపేస్తున్నాడు విజయ్. ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే వచ్చేస్తుంది. ఇక దీని తర్వాత మరో మూడు సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. క్రాంతి మాధవ్ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో పాటు మరో కొత్త దర్శకుడితో పని చేయబోతున్నానని కన్ఫర్మ్ చేసాడు ఈ హీరో. ఇది కూడా తన మనసుకు నచ్చిన కథ అంటున్నాడు విజయ్. తనకు స్టార్ డైరెక్టర్స్ కంటే కూడా కొత్త వాళ్లతో పని చేయడం అనేది చాలా హాయిగా ఉంటుందని చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత కొరటాల సినిమా ఉండే అవకాశం ఉందంటున్నాడు విజయ్ దేవరకొండ. ఆయనతో సినిమా కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నానని.. అతడితో పని చేయడం బాగుంటుందని చెబుతున్నాడు ఈ హీరో. అన్నీ కుదిర్తే ఆయన చిరంజీవి సినిమా పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత తామిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పాడు విజయ్ దేవరకొండ. మరి ఈ కాంబినేషన్ లో నిజంగానే సినిమా వర్కవుట్ అయితే అభిమానులకు అంతకంటే కావాల్సింది మరోటి లేదు.