English   

ఇష్మార్ట్ శంకర్ కి చరణ్ ప్రశంసలు !

ram
2019-07-25 21:58:17

ఇస్మార్ట్ శంకర్, టాలీవుడ్ సినిమాలలో తనదైన ముద్ర వేసిన పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో వచ్చిన పక్కా మాస్ మసాలా సినిమా ఇది. ఇద్దరికీ సరయిన హిట్ పడక ఆకలితో ఉన్నారేమో కానీ ఆ దెబ్బకు ఈ సినిమా అంచనాలను మించి ఆడుతూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నభా నటేశ్, నిధి అగర్వాల్ లు హీరయిన్లుగా నటించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ఏ సెంటర్ కంటే బీ, సీ సెంటర్లలోనే ఎక్కువ ఆడుతోంది. కలెక్షన్లు కూడా ఆశించిన దానికంటే ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో ఈ సినిమా అంతటి హిట్ కావడంతో ఒక పక్క అటు పూరీ అభిమానులు ఇటు రామ్ అభిమానులు ఇద్దరూ ఖుషీ అయిపోతున్నారు. అయితే ఈ సినిమాకి తాజాగా మెగా హీరో రామ్ చరణ్ ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో రామ్ అలాగే మిగతా అందరూ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎనర్జిటిక్ గా ఉందని, దీనంతటికీ కారణం అయిన పూరీగారికి అభిందనలు అని రామ్ చరణ్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. నిజానికి రామ్ చరణ్ ను హీరోగా లాంచ్ చేసింది పూరీనే. ఇక ఇప్పుడు చరణ్ సినిమా మీద పాజిటివ్ గా స్పందించడంతో పూరీ గతంలో మెగాస్టార్ తో తెరకెక్కిస్తానన్న ఆటో జానీ సబ్జెక్ట్ మీద కూడా అభిమానుల్లో ఆశలు రేగుతున్నాయి.

More Related Stories