English   

పూరీ జ‌గ‌న్నాథ్ కే ఈ క‌ష్టాలు ఎందుకొస్తున్నాయి..? 

puri
2019-07-26 07:32:06

సాధారణంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత ఆ దర్శకులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. వాళ్ల కోసం హీరోలు క్యూ కడుతుంటారు కానీ పూరి జగన్నాథ్ విషయంలో మాత్రం అది జరగడం లేదు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన కూడా ఎందుకో మరి ఈ స్టార్ హీరోలు ఈయ‌న వైపు చూడటం లేదు. దానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ విడుదలకు ముందు.. విడుదలైన తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లో పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయిప్పుడు. ముఖ్యంగా హీరోలు.. వాళ్ల అలవాట్ల గురించి ప్రతి ఇంటర్వ్యూలోనూ మాట్లాడాడు. ఎన్టీఆర్ రాష్ డ్రైవింగ్.. ప్రభాస్ ఫుడ్.. మహేష్ బాబు ఆటిట్యూడ్.. ఇలా ఏది పడితే అది మీడియా ముందు మాట్లాడేసాడు పూరీ. అదే ఇప్పుడు శాపంగా మారిందని తెలుస్తోంది. అయినా కూడా ఆయన వైపు చూడటానికి ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అన్నింటికీ మించి పూరి జగన్నాథ్ ఇంకా మారలేదు. ఆయన కథల విషయంలో అక్కడే ఆగిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ కూడా అదృష్టం కొద్దీ ప్రస్తుతం మార్కెట్లో ఏ సినిమా లేదు కాబట్టి మాస్ ఆడియన్స్ కి న‌చ్చి సూపర్ హిట్ అయింది. కానీ ఇందులో కూడా విషయం పెద్దగా ఏమీ లేదు అనేది విశ్లేషకులు తేల్చేసిన మాట. మరోసారి అదే ఫార్ములాను బేస్ చేసుకొని తెరకెక్కించాడు పూరి జగన్నాథ్. అందుకే స్టార్ హీరోలు కాస్త కొత్తదనం కోసం వెయిట్ చేస్తున్నారు. అది పూరి జగన్నాథ్ నుంచి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ వాళ్లతో సినిమాలు చేయడం ఖాయం. కానీ అప్పటి వరకు సెకండ్ గ్రేడ్ హీరోలను నమ్ముకుంటున్నాడు పూరి జగన్నాథ్.

More Related Stories